Header Banner

కుమ్మేసిన హిట్ 3.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? నాని కెరీర్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్!

  Fri May 02, 2025 14:09        Entertainment

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, యువ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ 3' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మే డే సందర్భంగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి, నాని కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన 'హిట్ 3'... విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొన్ని వర్గాల నుంచి హింసాత్మక సన్నివేశాలు అధికంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ, అది సినిమా కలెక్షన్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 'హిట్ 3' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

 

ఇది కూడా చదవండి: గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ఈ మేరకు చిత్ర బృందం ఒక అధికారిక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ అసాధారణ ఓపెనింగ్స్ తో నాని తన కెరీర్ లోనే అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా 'హిట్ 3' రికార్డు సృష్టించింది. వరుసగా వారాంతపు సెలవులు రానుండటం 'హిట్ 3' చిత్రానికి మరింత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే, ఈ వారాంతం ముగిసే నాటికి సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్ లోనూ 'హిట్ 3' భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతున్నట్లు సమాచారం. మొత్తంగా, 'హిట్ 3' బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుని, లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా పయనిస్తోంది.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Nani #AkkineniAkhil #KhushbuSundar #KondaSurekha